Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ ఇటీవల ఓ కార్యక్రమంలో డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మన సౌత్ ఇండస్ట్రీలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాని చేసిన డైరెక్టర్ శంకర్ అని తెలిపారు. శంకర్ గొప్ప దర్శకుడు ఆయన 3 ఇడియట్స్ సినిమాని తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులో స్నేహితుడు అనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాను. తెలుగు హీరోలతో ఒక సినిమా చేయమని శంకర్‌ను అడుగుదామనుకున్నా. ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదని తెలిపారు అయితే కొన్ని సంవత్సరాలకు అంటే RRR సినిమా షూటింగ్ సమయంలో నాకు దిల్ రాజు గారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది మీతో శంకర్ గారు సినిమా చేయాలనుకుంటున్నారు అంటూ ఆయన కాల్ చేశారు.
ఇలా శంకర్ గారు నాతో సినిమా చేయాలనుకుంటున్నారు అంటూ దిల్ రాజు చెప్పడంతో ఒక్కసారిగా నేను ఈ విషయాన్ని నమ్మలేకపోయానని చరణ్ తెలిపారు.మొదట నిజం అనుకోలేదు. నా కల నిజమైన క్షణమది. లార్జర్ దెన్ లైఫ్, కమర్షియల్ చిత్రాలను భారీస్థాయిలో తెరకెక్కించడంలో ఆయన మాస్టర్. రాజమౌళి శంకర్ వంటి గొప్ప దర్శకుల సినిమాలలో నేను భాగం కావడం నిజంగా నా అదృష్టం వారిద్దరూ టాస్క్ మాస్టర్లే అంటూ శంకర్ గురించి రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.