ఏంటి.. సాయి పల్లవి చాప్టర్ సౌత్ సినిమా దగ్గర ముగిసిపోయిందా?

సినిమా ప్రపంచంలో హీరోలు హీరోయిన్ లు వారి క్రేజ్ లు మార్కెట్ లు బేరీజు వేసుకొని రిలీజ్ చెయ్యడం ఎంత ముఖ్యమో సినిమాని ఎలా తీసుకెళ్లి సరైన ప్రమోషన్స్ నడుమ రిలీజ్ చేశారు అనేది కూడా ఆసక్తిగా మారుతుంది. మరి దీనితోనే ఓ భారీ క్రేజ్ ఉన్న హీరో లేదా హీరోయిన్ కూడా కొంతమంది తేల్చేస్తారు.

మరి అలాగే ఇప్పుడు పలువురు స్టార్స్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోలు పక్కన పెడితే టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిని ఇప్పుడు కొందరు టార్గెట్ చేయడం బాధాకరం. సాయి పల్లవికి ఒక మంచి సినిమా పడాలి కానీ ఆమె వల్లే సినిమా హిట్ అయ్యింది అని క్రెడిట్ అంతా ఆమెకే ఇచ్చేస్తారు.

ఇప్పుడు అలాగే ఓ సినిమా నష్టం పెద్దగా రీచ్ లేదు అంటే సాయి పల్లవి కెరీర్, చాప్టర్ అయ్యిపోయాయి అని వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాక్ నడుస్తుంది. ఆమె మెయిన్ లీడ్ లో నటించిన తాజా చిత్రం “గార్గి” థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.

అవును ఈ సినిమాకి ఇప్పుడు జీరో హైప్ ఉంది ఇంకా తెలుగులో డిజాస్టర్ ఓపెనింగ్స్ కూడా అందుకుంటుంది. దీనితో సాయి పల్లవి కెరీర్ అయ్యిపోయింది అని కొందరు అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ సినిమాలో తెలుగు లో ప్రమోషన్స్ లేవు ముఖ్యంగా ఈ సినిమా మొదలు ముగింపు కూడా ఎవరికీ తెలీదు.

దీనితో ఈ సినిమాకి మార్కెట్ లేదు అని ఏకంగా హీరోయిన్ నే తప్పుపట్టడం అనేది కాస్త ఆలోచించాల్సిన అంశమే. ఇక నెక్స్ట్ మరో సినిమా పడితే మళ్ళీ షరా మామూలే..