రాజకీయాల్లోనూ ‘రోజా’ యాక్టింగ్ మాత్రమే చేస్తున్నారా.?

రాజకీయం వేరు, నటన వేరు అని ఎవరన్నారు.? రెండూ ఒకటే. నటనా రంగంలోనూ రాజకీయాలుంటాయ్. రాజకీయాల్లోనూ నటిస్తుంటారు.

”బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జగన్ అనే రియల్ సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే..!!” అంటూ సినీ నటి, వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా ట్వీటేయడం గురించి రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇది.
అప్పట్లో అసెంబ్లీలో బాలయ్యతో సెల్ఫీలు..

కొన్నాళ్ళ క్రితమే జరిగిన సంఘటన ఇది. బాలకృష్ణ – రోజా.. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు. వైసీపీలో రోజా వున్నారు, టీడీపీలో బాలకృష్ణ వున్నారు. ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నారు. అసెంబ్లీలో ఏదో విషయమై పెద్ద రచ్చ నడుస్తోంది వైసీపీ – టీడీపీ మధ్య.

బాలకృష్ణ గ్యాలరీల్లో కూర్చుని ముచ్చట చూస్తున్నారు. రోజా అక్కడికి వెళ్ళి, బాలకృష్ణతో సెల్ఫీలు తీసుకున్నారు నవ్వుతూ.! రాజకీయాల్లో నాయకులు తిట్టుకుంటారు.. ఒక్కోసారి కొట్టుకుంటారు. ఆ తిట్ల ప్రసహనం కూడా అత్యంత జుగుప్సాకరంగా వుంటుంది. ఇదంతా నిజమేననుకుంటే పొరపాటే.

అంతా నటనే.! ఇప్పుడు రోజా వేసిన ట్వీటు గురించి కూడా అలాగే అనుకుంటున్నారు జనం. బాలకృష్ణ, వైఎస్ జగన్ మీద విమర్శలు చేసింది కూడా అలాంటిదేనా.? అంతేనేమో.! ఎందుకంటే, బాలయ్య వీరాభిమాని వైఎస్ జగన్.

ఒకప్పుడు కడప బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ పనిచేశారంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ‘ఇక్కడ ఫ్లూటు ఊదినోడు ఎవ్వడు’ అంటూ ఆ క్లిప్పింగ్స్‌ని బాలయ్య అభిమానులు ప్రచారం చేస్తున్నారు.