అధికార పక్షంపై విమర్శలే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కుతంత్ర రాజకీయాల గురించి తెలియంది ఎవరికి? ప‌్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల నుంచి మొన్నటి గ్యాస్ లీకేజ్ ఘటన, డాక్టర్ సుధాకర్ వ్వవహారంలో చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీల్తే చంద్రబాబు వక్రబుద్ది ఎలా ఉందన్నది! స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే డాక్టర్ సుధారక్ ని ప్రభుత్వం మీదకు తాచు ప్రాములా ఉసిగొల్పి ఇరకాటంలో పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పంచాయితీ సీబీఐ కోర్టులో ఉంది. తాజాగా రంగనాయకమ్మ విషయంలో చంద్రబాబు హస్తం ఉందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం కొలువు దీరిన దగ్గర నుంచి రంగనాయకమ్మ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారని ఆమె గత పోస్టులను పరిశీలిస్తే క్లియర్ గా అర్ధమవుతోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నాని పెద్దావిడ చెబుతున్నా! పాత పోస్టులతో ప్రభుత్వంపై ఆమె వైఖరి ఎలా ఉందన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులతో వెలుగులోకి వచ్చిన పెద్దావిడ ఇప్పుడు ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన రంగనాయకమ్మపై ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తోంది.
చంద్రబాబు అండతోనే రంగనాయకమ్మ అంత ధైర్యంగా ప్రభుత్వంపై వ్యతిరకంగా పోస్టులు పెట్టినట్లు వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దావిడ చంద్రబాబు వదిలిన రెండవ బాణమంటూ విమర్శిస్తున్నారు. ఆమె గత పోస్టుల్లో ఒక్కటి కూడా ప్రభుత్వానికి మద్దతుగానీ, ప్రశంసిస్తున్నట్లుగానీ ఎక్కడా కనపించకపోవడమే ఇన్ని అనుమానాలకు తావిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచారు. పేద బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ రంగనాయకమ్మకు అవేమి కనిపించలేదు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ప్రజలే విమర్శించారు. విజయవాడ వేదికగా ఆయన ప్రయాణిస్తున్న బస్సుపైనే రాళ్లు రువ్వి వ్యతిరేకంగా గళాన్ని వినిపించారు. కానీ రంగనాయమ్మకు అప్పటి చంద్రబాబు గుర్తులేడు. అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పెద్దావిడ ఒక పోస్ట్ కూడా ఎక్కడా పెట్ట లేదు. మరి జగన్ పైనే బురద చల్లడం దేనికంటూ సోషల్ మీడియా వేదికగా పెద్దవిడపై నెటి జనులు విమర్శలు గుప్పిస్తున్నారు. రంగనాయకమ్మలో పేదల పట్ల నిజాయితీగా వ్యహరించాలనుకుంటే చంద్రబాబు పాలనని ఎందుకు విమర్శించలేదని ప్రశ్నిస్తున్నారు. వీటికి కూడా రంగనాయకమ్మ బధులిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.