జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఏమిటో ఒక్కోసారి ఆయనకే సరిగ్గా అర్ధం కావని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న మరో నిర్ణయం కూడా ఆయనకు వచ్చే మైలేజ్ ను రాకుండా చేసిందని చెపుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమరం నువ్వా – నేనా అన్నట్లు సాగింది. చివరికి తెరాస ను ఓడించి బీజేపీ సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికలకు ముందు దుబ్బాకలో బీజేపీ తరుపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నాడు అనే మాటలు గట్టిగానే వినిపించాయి.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం దాని జోలికి వెళ్లకుండా సైలెంట్ గా ఉన్నాడు , తీరా అక్కడ బీజేపీ విజయం సాధించింది, ఇదే కనుక తను కూడా ప్రచారానికి వెళ్లి వుంటే ఈ విజయంలో తన వాటా తాను తీసుకుని వుండేవాడిని అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫీలవుతున్నట్లు బోగట్టా. కచ్చితంగా జనసేన ఖాతాలో ఓ పాజిటివ్ పాయింట్ పడి వుండేదని ఆయన తెగ సతమతమవుతున్నారని తెలుస్తుంది. ఇక దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ట్విట్ చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారానికి పోలేదో ఇట్టే అర్ధం అవుతుంది.
ఆ ట్విట్ లో ఎక్కడ కూడా పొరపాటున కేసీఆర్, కేటీఆర్ అనే పదాలు లేకుండా ఎంతో జాగ్రత్తగా జనసేనాని ఆ ట్విట్ వేసాడు. అదే విజయం ఆంధ్రాలో సాధించి ఉంటే మాత్రం వైకాపాకు బుద్ది చెప్పారు. జగన్ కు గుణపాఠం నేర్పారు లాంటి పదాలు వాడి వుండేవారు. కానీ ఇక్కడున్నది కేసిఆర్ కదా? అందుకే అస్సలు అలాంటి పదాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక దుబ్బాకలో బీజేపీ విజయం సాధించటంతో ఆ పార్టీ గ్రేటర్ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో బీజేపీ తో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేయటం కోసం 50 డివిజన్స్ లో కమిటీలను ఏర్పాటు చేశాడు , ఇక దుబ్బాక ఇచ్చిన బూస్ట్ తో పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ తో కలిసి ముందడుగు వేస్తాడేమో చూడాలి..? లేకపోతే సీఎం కేసీఆర్ తో ఎందుకు వచ్చిన పేచీ అని భయపడి వెనకడుగు వేస్తాడో చూడాలి..