పవన్ ను దెబ్బకొట్టిన కరోనా, 2024 ఎన్నికలకు సిద్ధమేనా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న తపనతో జనసేన అనే పార్టీని స్థాపించారు. ప్రజలకు కోసం ముందుండి నడవాలని అనుకున్నారు. అయితే పార్టీ స్థాపించిన తరువాత 2014 ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు తెలిపారు. అయితే తరువాత కాలంలో టీడీపీ ప్రవర్తన నచ్చని పవన్ కళ్యాణ్ టీడీపీ నుండి వేరుగా వచ్చి, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ ఓటమి కూడా పవన్ లో ఉన్న ప్రజాసేవ చేయాలన్న తపనను చంపలేకపోయింది. ప్రజా సేవ కోసం ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే పార్టీని నడిపించాలంటే తపన ఉంటే దానికోసం డబ్బు కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ సినిమాలు చెయ్యడం ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి ఇబ్బందులను ఎదుర్కొన్న పవన్ ఇప్పుడు కరోనా నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

pawan kalyan telugu rajyam
pawan kalyan telugu rajyam

పవన్ ను ఇబ్బందులు పెడుతున్న కరోనా

కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూవీస్ చేసి వాటి నుండి వచ్చే డబ్బుతో పార్టీని నడిపంచవచ్చని, 2024 ఎన్నికల సమయానికి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టవచ్చని పవన్ అనుకున్నారు. అయితే కరోనా వల్ల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. పవన్ పతకం విఫలమైంది. కరోనా లేకపోతే ఇప్పటికే వకీల్ సాబ్ విడుదల అయ్యుండేది, మిగితా షూటింగ్స్ కూడా దాదాపు పూర్తి అయ్యేవి. కానీ కరోనా పవన్ ప్లాన్ ను పూర్తిగా నాశనం చేసింది. గతంలోలాగా షూటింగ్ లు చేస్తూ రాజకీయాలు చేయడం కుదరదు ఎందుకంటే పోయిన ఎన్నికల సమయంలో కూడా ఇలా చేయడం వల్లే ప్రజలు పవన్ నమ్మలేదని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. కాబట్టి ఈసారి ఎన్నికల సమయానికి పూర్తిగా రాజకీయాల్లో ఉంటే తప్ప కనీసం సీట్స్ గెలవరని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

పవన్ ఢిల్లీ వెళ్లనున్నారా!

ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకులు ఢిల్లీ వెళ్లడం అనేది ఒక వింతగా మారింది. అక్కడికి వెళ్తే ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయవ్యూహం పన్నుతారో అర్ధం కావడం లేదు. మొన్నటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కేంద్ర బీజేపీ నుండి పిలుపు వచ్చిందని, త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసలే బీజేపీ ఏపీలో స్థిరపడటానికి అనేక పతకాలు రచిస్తోంది. అయితే ఇప్పుడు తమతో పొత్తులో ఉన్న పవన్ తో ఎలాంటి రాజకీయ వ్యూహం రచిస్తారో వేచి చూడాలి.