రాజకీయాల్లో గెలుపు నాయకులకు గర్వాన్ని పెంచుతుంది. ఇప్పుడు వైసీపీ నాయకులకు కూడా 2019 ఎన్నికల్లో వచ్చిన ఇచ్చిన గర్వం అంతా ఇంతా కాదు. ఆ గర్వం వల్ల అధికారం ఇచ్చిన ప్రజలు కూడా కనిపించడం లేదు. రాజకీయాలో సమీకరణాలు ఎప్పుడైనా మరిపోవచ్చు , అలాగే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా వైసీపీకి పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పించనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్న జగన్ కు ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు బుద్ధి చెప్పనున్నాయని ప్రతిపక్షాలు కూడా భావిస్తున్నాయి.
జగన్ మరో కేసీఆర్
తెలంగాణలో వరుసగా రెండుసార్లు ,ముఖ్యమంత్రిగా గెలిచిన సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో తనకు పోటీనే లేదని, టీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీ తెలంగాణలో రాదనే గర్వంతో మాట్లాడే వాడు. అయితే ఒక్కసారి దుబ్బాక ఎన్నికలో ప్రజలు బీజేపీ పక్షాన నిలబడటంతో కేసీఆర్ లో భయం మొదలైంది.అలాగే ఇంకా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ కు గట్టిగా బుద్ధి చెప్పారు. అలాగే ఇప్పుడు ఏపీలో జగన్ కు కూడా ప్రజలు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుద్ధి చెప్పనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
టీడీపీకి బలం చేకూరనుందా!!
వైసీపీ నాయకులు ఇంకా 2019 ఎన్నికల్లో వచ్చిన విజయం నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇంకా ఆ విజయఆనందంలోనే ఉంటూ పంచాయితీ ఎన్నికలను పట్టించుకోవడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అధికంగా సాధించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు కానీ చాలా చోట్ల వైసీపీ నాయకులు ఇక నిర్ణయంతో అభ్యర్థిని నిలబెట్టలేకపోతున్నారు. వైసీపీ నాయకులు వర్గాలుగా చీలిపోయి గొడవలు పడుతున్నారు. కిందిస్థాయి నుండి బలపడి వచ్చే ఎన్నికల్లో గెలవాలని వ్యయాలు రచిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఉన్న వర్గ గొడవలు టీడీపీకి బలం చేకూర్చానున్నాయి.