కన్నా లక్ష్మి నారాయణ ఇతర పార్టీల నుండి బీజేపీ లోకి వలస వచ్చిన నేతైనా కానీ, బీజేపీ పార్టీ ఆయనకు అగ్ర తాంబూలం ఇస్తూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది, అయితే కన్నా లక్ష్మి నారాయణ రెండేళ్లు మాత్రమే అందులో పనిచేశాడు, అతని పనితీరు నచ్చకనో లేక వేరే కారణాలు వలనో కానీ కన్నాను పదవి నుండి తప్పించి ఆ స్థానంలో సోము వీర్రాజు ను నియమించారు. దీనితో కన్నా పార్టీ కి దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో కన్నా లక్ష్మి నారాయణకు అనుకోని విధంగా ఒక భారీ జాక్ పాట్ తగలబోతుందని సమాచారం.
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ నుండి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఇప్పుడు బీజేపీ కి 3 స్థానాలు వున్నాయి. అసెంబ్లీ సంఖ్య ప్రకారం చూసుకుంటే ఈ మూడు కాకుండా మరో ఐదు స్థానాలు బీజేపీ కి వచ్చే అవకాశం వుంది. ప్రస్తుతం ఉన్న మూడింటిలో సిట్టింగ్ వాళ్ళకే అవకాశం ఇచ్చిన కానీ మిలిగిన ఐదు లో మూడు ఉత్తర్ ప్రదేశ్ వాళ్ళకి ఇచ్చిన , ఒకటి ఆంధ్ర కు , మరొకటి తెలంగాణకు ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ నుండి గరికపాటి మోహన్ రావు, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లకు ఎక్కువగా అవకాశం ఉండగా, ఆంధ్ర నుండి పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ జాతీయ స్థాయిలో ఉంటున్న రామ్ మాధవ్ కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది.
వీళ్ళలో కన్నాకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పురందేశ్వరికి జాతీయ నాయకురాలి హోదా ఇవ్వటంతో ఆమెకు రాజ్యసభ కష్టమే అని తెలుస్తుంది. గతంలో జివిఎల్ కు, నిర్మల సీతారామన్ లాంటి వాళ్ళను ఇతర రాష్ట్రాల నుండి రాజ్యసభకు బీజేపీ పంపించింది. అదే కోవలో ఇప్పుడు కన్నాను పంపించే అవకాశం మెండుగా ఉన్నట్లు బీజేపీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే కన్నా లక్ష్మి నారాయణకు పెద్ద జాక్ పాట్ తగిలినట్లే అని చెప్పుకోవచ్చు. అధ్యక్ష పదవి పోయిననాటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కన్నా, ఈ వార్తతో మళ్ళీ యాక్టీవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కన్నా అనుచర వర్గం దాదాపుగా రాజ్యసభ తమ నేతకే అంటూ కంఫర్మ్ అవ్వటం విశేషం