జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకొని అనంతరం ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున జబర్దస్త్ నిర్వాహకులపై ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్ పి బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఈయన రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన కిరాక్ ఆర్పి తన రెస్టారెంట్లో అన్ని రకాల చేపల పులుసును అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈయన రెస్టారెంట్లో ప్రతి ఒక్క ఐటెం కూడా కట్టెలపోయే మీద చేయడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.ఇలా అన్ని వంటకాలు కట్టెల పొయ్యి పై చేయడంతో ఈయనకు బిజినెస్ కూడా బాగా జరుగుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఆర్పి ఒక్క రోజుకు సుమారు రెండు లక్షల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందట ఇలా నెలకు 60 లక్షల బిజినెస్ జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. రెస్టారెంట్ బిజినెస్ మంచిగా జరగడంతో హైదరాబాద్లో మరికొన్ని బ్రాంచెస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.ఇక ఆర్పి నెల్లూరుకు చెందిన వ్యక్తి కావడంతో నెల్లూరు చేపల పులుసుకు ఫేమస్ కనుక ఈయన చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారని చెప్పాలి.