Kirak RP: పవన్ పై జగన్ విమర్శలు…నువ్వు రాజకీయాలకు తక్కువ అంటూ సెటైర్లు పేల్చిన ఆర్పీ!

Kirak RP: ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ… ఆ మనిషి కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు జనసైనికులను కూటమి నేతలను బాగా హార్ట్ చేసాయని తెలుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తమలైన శైలిలోనే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కమెడియన్ కిరాక్ ఆర్పి సైతం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

ఈ సందర్భంగా కిరాక్ ఆర్పి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని పట్టుకొని కార్పోరేటర్ కి ఎక్కువ … ఎమ్మెల్యేకు తక్కువ అంటూ మాట్లాడతారా అసలు నీ గురించి చెప్పనా నువ్వు చీప్ ట్రిక్స్ కి ఎక్కువ పాలిటిక్స్ కి తక్కువ. భగవంతుడు వారి వారి విధానాలను బట్టి వారికి పేర్లను అనుసరిస్తూ ఉంటారు. నువ్వు జగన్ .. నీ పేరులోనే గన్ అని ఉంది. నీ పేరులో గన్ ఉంది అంటే ఎవరిని ఎప్పుడు గన్ను పట్టుకుని బెదిరిద్దామా ఎవరిని గన్నుతో కాల్చేద్దామా అని ఆలోచనలు నీకే ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ పేరులో వన్ అని ఉంది.

ఆయన రాష్ట్రాన్ని ఎప్పుడు నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్లో పెట్టాలని సంకల్పిస్తుంటారు కాబట్టి ఆయన పేరులో వన్ అని ఉంది అంటూ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, ఒక బకాసురుడిని రోట్లో వేసి దంచితే ఒక ముద్ద వస్తుంది ఆ ముద్ద నువ్వు అంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. ఇలా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి కిరాక్ ఆర్పీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి అయితే ఈయన వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.