చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పట్టబోతుందా

chandrababu kcr telugu rajyam

 ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధాన కారణం తన కొడుకు లోకేష్ బాబును దొంగదారిలో మంత్రిని చేయటమే, దీనిపై సామాన్య ప్రజలు కూడా విమర్శలు చేసే స్థాయికి వెళ్లారంటే అది ఎంత పెద్ద తప్పో అర్ధం చేసుకోవచ్చు. వేరే నేతల విషయంలో అదే విధంగా చేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ, ఒక ముఖ్యమంత్రి కొడుకును దొడ్డిదారిలో మంత్రిని చేస్తే విమర్శలు కచ్చితంగా వస్తాయి.

cm kcr kavitha telugu rajyam

 

 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురిని ప్రజలు తిరస్కరించారు. దీనితో ఎలాగైనా సరే ఆమె ముందు మాజీ అనే పేరు ఉండకూడదు అనుకున్న కేసీఆర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆమెను గెలిపించటం కోసం ‘గట్టి’ ప్రయత్నాలే చేసి విజయం సాధించాడు . తమకున్న ఓట్లు ద్వారానే విజయం ఖాయమని తెలిసిన కానీ, కూతురి ఎన్నికల విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ కి చెందిన దాదాపు వంద మంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయటంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి టైం లో కవితను తన క్యాబినెట్ లోకి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

 ఎమ్మెల్సీ ద్వారా ఎన్నికైన ఆమెను మంత్రిగా చేస్తే అది దొడ్డిదారి అవుతుంది. అప్పుడు చంద్రబాబు చేసినట్లే, ఇప్పుడు కేసీఆర్ చేసినట్లు అవుతుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలనా చేస్తుందని, తెలంగాణను బంగారం చేయటం కంటే, వాళ్ళ ఇల్లును బంగారుమయం చేసుకుంటున్నారు అనే విమర్శలు వచ్చాయి. కేసీఆర్ కాకుండా మంత్రి వర్గంలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఉన్నారు . వాళ్ళకి తోడుగా ఇప్పుడు కవిత కూడా మంత్రి అయితే ప్రజల్లో వున్నా కుటుంబ పాలనా అనే ముద్ర ఇంకా బలపడుతుంది.

 అదే కాకుండా మైనారిటీకి చెందిన మహమూద్ అలీని తొలగించి ఆయన స్థానంలో హోంమంత్రి పదవి కవితకు ఇవ్వబోతున్నారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదే కనుక జరిగితే కేసీఆర్ ఘోర తప్పిదం చేసినట్లు తెలుస్తుంది. దొడ్డిదారిన కొడుకును మంత్రిని చేశాడనే అపకీర్తి మూటగట్టుకొని చంద్రబాబు సాధించింది ఏమి లేదు. పైగా అధికారం కోల్పోవటానికి అది ఒక కారణం అయ్యింది. ఇప్పుడు కేసీఆర్ కూడా కూతురిని దొడ్డిదారిన మంత్రిని చేసి, బావుకునేది ఏమి లేదు. పైగా వ్యతిరేకత మూటకట్టుకోవటం తప్ప. మరి అన్ని విషయాలు తెలిసిన కేసీఆర్ తన కూతురి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి