Home News తనని ఇన్సల్ట్ చేసిన మోడీ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్న కే‌సి‌ఆర్ ?

తనని ఇన్సల్ట్ చేసిన మోడీ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్న కే‌సి‌ఆర్ ?

 సీఎం కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వటం బాగా ఇష్టమైన పని, అసలు కేసీఆర్ మూలంగానే రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్ అనే పదం వాడుకలోకి వచ్చిందని చెప్పాలి. 2018 ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ తనకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు కు ఆంధ్రాలో తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పటంతో అప్పటి నుండి రిటర్న్ గిఫ్ట్ బాగా ఫేమస్ అయ్యిపోయింది. ఇక ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ ప్రధాని మోడీకి ఇవ్వబోతున్నట్లు తెరాస పార్టీ నేతలు చెపుతున్నారు.

Cm Kcr Pm Modi

 గ్రేటర్ లో తెరాస-బీజేపీ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల పోరాటం చేస్తున్నాయి, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు వచ్చారు, శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారట. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది.

అయితే దీనిని తెరాస పార్టీ రాజకీయంగా వాడుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధాని అధికారిక పర్యటనకు రాష్ట్ర సీఎంను రావొద్దని చెప్పడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టిన ఢిల్లీ పెద్దలకు తగిన బుద్ది చెబుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. ఆనాడు సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించినట్లు ఈనాడు కేసీఆర్ ను మోదీ అవమానిస్తున్నారని విమర్శించారు. దీనితో తెరాస నేతలందరూ దీనినే హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో వాడుతున్నారు, కేసీఆర్ ను అవమానించిన మోడీకి గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీ ఘనవిజయం సాధించి బీజేపీ కి రిటర్న్ ఇవ్వబోతున్నట్లు తెరాస నేతలు చెపుతున్నారు.

 

- Advertisement -

Related Posts

నరాలు తెగే ఉత్కంఠ: నిమ్మగడ్డ, వైఎస్ జగన్.. గెలిచేదెవరు.?

గంటలు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో చాలామందిలో నరాలు తెగే ఉత్కంట పెరిగిపోతోంది. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

పవ‌న్‌ను ఆపలేక చేతులెత్తేసిన వైసీపీ.. మళ్ళీ చంద్రబాబు దగ్గరికే చేరారు 

ఒక వ్యక్తి మీద ఒక విషయంలో ఒక విమర్శ చేయవచ్చు. జనం కూడ దాన్ని వింటారు, పట్టించుకుంటారు.  కానీ అదే వ్యక్తి మీద అన్ని విషయాల్లోనూ ఆ ఒక్క విమర్శనే మళ్ళీ మళ్ళీ...

తూ.గో.జిల్లాను దడదడలాడిస్తూనే ఎమ్మెల్యే.. వైసీపీ నేతలు సైతం సైలెంట్ 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ అండ చూసుకుని హద్దులు దాటిపోతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటివారి మూలంగా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలే ఇబ్బందులుపడుతున్నారు.  బయటివారినే కాదు సొంత పార్టీ నేతలను కూడ ఈ ఎమ్మెల్యేలు లెక్కచేయట్లేదు.  అంతా...

Latest News