బీజేపీకి కంభంపాటి గుడ్ బై చెప్పబోతున్నాడా..?

kambhampati haribabu telugu rajyam

 సాధారణంగా రాజకీయ పార్టీలు అన్ని బలమైన నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకి వెళ్తుంటాయి. తమ పార్టీలో అనుభవం ఉందా..? లేదా అని చూడకుండా గట్టి నేతలు అనిపిస్తే చాలు అందలం ఎక్కిస్తారు, అయితే బీజేపీలో మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది, మొదటిగా తమ పార్టీ సొంత నేతలకే పెద్ద పీట వేస్తుంటారు, ఆ తర్వాత పక్క పార్టీల నుండి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు, అయితే ఇవన్నీ గతంలో, ఇప్పుడు పరిస్థితిలు మారిపోయినట్లు తెలుస్తుంది.

kambhampati hari

 

  ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పరిస్థితి గమనిస్తే సృష్టంగా తెలుస్తుంది. పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్న కానీ వాళ్ళని కాదని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పురంధేశ్వరికి రావటంతో బీజేపీలోని స్థానిక సీనియర్ నేతలో అసంతృప్తి బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంభంపాటి హరిబాబు ఏకంగా పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ మీద విశాఖపట్నంలో గెలిచి వార్తల్లో నిలిచాడు, ఆ ఐదేళ్లు పార్టీ లో క్రియాశీలకంగా పనిచేసాడు. ఇక రెండోసారి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావటంతో తనకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కోటా నుండి మంచి పదవులే లభిస్తాయని ఆశ పడ్డాడు. ఒక దశలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడనే మాటలు వినిపించాయి. అయితే ఆ పదవి దక్కలేదు. దీనితో జాతీయ స్థాయి పదవుల కోసం ఎదురుచూశాడు. అందులో కూడా నిరాశే ఎదురైయ్యింది.

  నిజానికి విశాఖపట్నం లాంటి సిటీకి ప్రాతినిత్యం వహించిన కంభంపాటి రేస్ లో ఎందుకు వెనకపడ్డాడో అర్ధం కానీ విషయం. 2019 ఎన్నికల తర్వాత ఎందుకో సైలెంట్ గా ఉంటున్నాడు, పార్టీలో చురుగ్గా ఉన్న నేతలకే కొద్దో గొప్పో మంచి పదవులు దొరుకుతాయి, పట్టీపట్టనట్లు వుండే వాళ్ళని పార్టీ కూడా పక్కన పెడుతుంది, కంభంపాటి హరిబాబు విషయంలో కూడా సరిగ్గా అదే జరిగందని కొందరు చెపుతున్న మాట. అయితే దానిని పైకి కనిపించకుండా తనకు అనుకున్న పదవి రాలేదని, పార్టీలో తనకంటే జూనియర్ అయినా పురంధేశ్వరి కీలక పదవి ఇచ్చి, తనని పక్కన పెట్టారనే కారణం చూపెడుతూ పార్టీ నుండి పక్కకు తప్పుకోవాలనే ఆలోచనలో కంభంపాటి ఉన్నట్లు తెలుస్తుంది. మరి బుజ్జగింపులు పర్వం ఏమైనా జరుగుతుందో, లేదో మాత్రం తెలియటం లేదు.