ఏపీలో ఎలాగైనా జెండా పాతేయాలి అన్న ఎజెండాతో ముందుకెళ్తోంది బీజేపీ. ఆరు నూరైనా…నూరు ఆరైనా ఎలాగైన టీడీపీని తొక్కేసి ఆ స్థానంలో బీజేపీ కూర్చోవాలని ఎత్తుగడ వేస్తోంది. ఆ రకంగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా పచ్చ బ్యాచ్ పై కమలనాథులు కన్నెరజేస్తూనే ఉన్నారు. ఓపక్క అధికార పక్షం జోలికి వెళ్లి ! వెళ్లకుండా ఉంటూ సైకిల్ బ్యాచ్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ మెయిన్ టార్గెట్ అదే కాకపోయి ఉంటే కన్నా లక్ష్మీనారాయణను అసలు తప్పించే వారు కాదు అన్నది సుస్పష్టం. రాజధాని విషయంలో కన్నా పై ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ మోదీ వేసిన అమరావతి పునాది రాయిని ఆయనే మళ్లీ పాతాళంలోకి తొక్కేయడం అన్నది నిజంగా దారుణమే.
ఈ ఒక్క ఘటన చాలదా! టీడీపీని కమలనాథులు ఏస్థాయిలో ద్వేషిస్తున్నారు అనడానికి! జగన్ మోహన్ రెడ్డి జోలికి రాకుండా బీజేపీ ఏపీలో అలా ముందుకెళ్తోంది. ఇక మూడు రాజధానుల విషయంలో బీజేపీ కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడింది. అలాగే పార్లమెంట్ లో శాసనమండలి బిల్లును రద్దుని ఆమోదించలేదు. ఇక్కడే మోదీ సిసలైన రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మోదీలో ఈ కోణాన్ని అర్ధం చేసుకోలేని కొంత మంది అవివేకులుగా మారి దేవుడితో కొలుస్తున్నారని అని భావిస్తున్నారు. మోదీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు మాత్రం ఇదేం! శని అని అనుకుంటున్నారు.
ప్రజలపై ప్రేమ..అందుకు కావాల్సిన సేవ చేస్తే ప్రజలే ఆ స్థానాన్ని కట్టబెడతారు కదా! ఆ మాత్రం దానికి ఇంత రాజకీయం బీజేపీకి అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం చెప్పాల్సిన వాటికి సమాధానం చెప్పకుండా…పరిష్కరించాల్సిన సమస్యలను పరిష్కరించకుండా ఇలా దొంగనాటకాలు ఆడటం దేనికని! గట్టిగానే గళం వినిపిస్తున్నారు. వీటన్నింటిని ఏదో రోజు యంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అర్ధమయ్యేలా వివరించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు. మరి జగన్ ఇలా ఎన్నాళ్లు మౌనం దాల్చుతారు. ఎప్పుడు ఆయనలో అగ్ని పర్వతం బద్దలవుతుంది. కేసీఆర్ లా ఎప్పుడు ఢీ అంటారో చూద్దాం. ఆ రోజు వస్తుందని ఆశిద్దాం.