Prime Minister Modi: రాజకీయ నాయకులకు, మంచి పలుకుబడిలో ఉన్న వాళ్లకు, సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు కొందరు దుండగుల నుండి బెదిరింపులు వస్తుంటాయి. వారిని చంపేస్తామనో లేదా డబ్బులు దోచుకోవడం కోసమో ఫోన్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా బెదిరిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని మోదీ కి కూడా బెదిరింపులు ఎదురయ్యాయి.
ముంబైలో ఎన్ఐఏ కార్యాలయానికి ఆయనను హత్య చేయనున్నట్లు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఈయన హత్యకు 20 మందితో స్లీపర్ సెల్స్ రెడీగా ఉన్నట్లు తెలిసింది. 20 కేజీల ఆర్డీఎక్స్ కూడా సిద్ధం చేసినట్లు దుండగులు తెలిపినట్లు తెలిసింది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అవటంతో.. ఈ మెయిల్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అని దర్యాప్తు చేస్తున్నారు.