రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ!

ప్రస్తుతం రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ లో నిన్న ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సైరస్ మిస్త్రీ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సైరస్ మిస్త్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

వివరాలలోకి వెళితే…సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు పాల్ఘాట్ ప్రాంతంలోని వేరొక వాహనాన్ని క్రాస్ చేయటంలో వేగంగా వెళ్తున్న కారు చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో రోడ్డు డివైడర్‌ను గట్టిగా ఢీకొట్టింది.ఆ సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా కారు నడిపిన డ్రైవర్ తో సహా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ తో సహా మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని గుజరాత్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారును ఒక మహిళ గైనకాలజిస్ట్ నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. కారు అతి వేగంగా వచ్చి వేరొక వాహనాన్ని క్రాస్ చేయటానికి ప్రయత్నించటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు. ఇదిలా ఉండగా సైరస్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలియజేశాడు. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నితిన్ గట్కరి, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ తదితరులు సైరస్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.