ఏపీలోనూ కరోనా ఉగ్రరపం దాల్చుతోంది. కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్యలో దేశం 5వ స్థానంలో ఉంటే..మరణాల సంఖ్యలో 10 వ స్థానంలో ఉంది. కరోనా విలయ తాండవం ఇప్పుడిప్పుడూ చూపిస్తోంది. లాక్ డౌన్ పెట్టాలన్న ఆలోచనలో ఏ రాష్ర్టం లేదు. ఎందుకంటే ఇంతకు మించి లాక్ డౌన్ లు పెట్టుకుంటే పోతే రూలింగ్ లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాష్ర్టాలు ఆర్ధికంగా నష్టాల ఊబిలో కూరుకుపోతాయి. దీంతో ఏ ముఖ్యమంత్రి కూడా లాక్ డౌన్ వైపు మొగ్గు చూపలేదు.
ఇక ఏపీలో జగన్ వైరస్ తో కలిసి ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి..జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు వెళ్లిపోవాల ని నిశ్చయించారు. దీనిలో భాగంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం రంగం సిద్దం చస్తోంది. వచ్చె నెలలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించిన మార్గ దర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇటు ప్రతిపక్షం మాత్రం పరీక్షలు నిర్వహించొద్దంటూ కోరుతుంది. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరీక్షలు మంచిది కాదని…రద్దు చేయడమే ఉత్తమం అని కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ర్టాలు పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే ఏపీలో రద్దు చేసి విద్యార్ధులను పైతరగతులకు పంపించాలన్న డిమాండ్ల పర్వం వ్యక్తం అవుతోంది.
అయితే జగన్ సర్కార్ మాత్రం వీటిని ఎక్కడా పట్టించుకున్నట్లు కనిపించలేదు. మీ పని మీదే..మా పని మాదే అన్నట్లే ముందుకు వెళ్లిపోతుంది. పాలనలో కేసీఆర్ ను అనుకరించే జగన్ ఈ విషయంలో మాత్రం ఆ సీఎం ని కూడా పట్టించుకోలేదు. ప్రతిపక్షం నెత్తి నోరు కొట్టుకున్నా చెవికెక్కించుకోవడం లేదు. విద్యార్ధుల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి కూడా జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరి ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గుతారా? ముందుకు వెళ్తారా? అన్నది చూడాలి.