Corona Virus: కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిలో ఉగ్రరూపం దాల్చింది. గత ఏడాది అక్టోబర్ , నవంబర్ లో థర్డ్ వేవ్ రావచ్చు అని నిపుణులు నిపుణులు హెచ్చరించారు . ఇవాళ ఒక్కరోజే దాదాపు రెండు లక్షల కేసులు వచ్చాయి అంటే దీని తీవ్రత ఎంతలా ఉందో ఊహించుకోవచ్చు. మొదటి వేవ్, రెండవ వేవ్, ఒకసారి వచ్చి తగ్గిన వారందరినీ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ మునుపటి వేరియంట్లతో పోల్చితే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది . దీని బారిన పడినవారు ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల దీని నుండి త్వరగా బయటపడవచ్చు.
కూల్ డ్రింక్స్ చాలామంది ఇష్టంగా తాగుతుంటారు. ఇందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణంగానే షుగర్ ఎక్కువగా ఉంటే ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉంటుంది. Covid 19 సోకిన వ్యక్తులు కూల్ డ్రింక్స్ ను తాగకుండా నిమ్మరసం, మజ్జిగ లాంటివి తాగటం శ్రేయస్కరం.
covid 19 సోకిన వ్యక్తులలో సహజంగానే దగ్గు, గొంతు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కారంగా ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మిరియాలలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కారం తినాలి అనుకునేవారు దాని బదులుగా మిరియాలను వాడితే మీ గొంతు సమస్యలు తగ్గి వైరస్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.
వేపుళ్ళు చాలా రుచిగా ఉంటాయి. అదేవిధంగా ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. సాధారణంగా చిన్న జ్వరం వచ్చినా కూడా మన జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. వేపుళ్ళు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి కాబట్టి వేపుళ్లకు దూరంగా ఉంటే వైరస్ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా బయటపడవచ్చు.
ప్యాకేజ్డ్ ఫుడ్/జంక్ ఫుడ్: నేటి యువత ఇన్స్టెంట్ గా దొరికే ఆహార పదార్థాల మీద ఎక్కువ మక్కువ చూపుతారు. కరోనా సోకిన వ్యక్తులు ప్యాకేజ్డ్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. వీటివల్ల ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు లేదా పొటాషియం వంటివి ఏవి లభించవు. వీటిని తినటం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఇంకా ఎక్కువ ఉంది .
కరోనా బారినపడిన వారు పైన చెప్పిన పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా బయట పడవచ్చును.