జగన్ కి ఫుల్ క్లాస్ పీకి , మొట్టికాయలు వేసిన మోడీ .. బాబుగారి మీడియా వింత హడావిడి !

గాలి కబుర్ల గంగయ్య ఒక ఘాటు వార్త మోసుకొచ్చాడు అని అనుకుంటున్నారట ఇప్పుడు ప్రచారం అవుతున్న ఒక విషయాన్ని గమనించిన ఏపీ ప్రజలు.. నోటి దురదతో ఒకరుంటే.. ఊసరవెళ్లిలా మరొకరు మారుతున్నాడట.. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షం చేస్తున్న పరకాయప్రవేశం గురించే ఈ టాపిక్.. నిన్న మొన్నటి వరకు వైఎస్ జగన్ బీజేపీకి మరింత దగ్గరవుతున్న విషయాన్ని గమనించిన ఈ పచ్చ రంగు పార్టీ ఇంకా ఏమైనా ఉందా.. మోదీతో, వైఎస్ జగన్.. ఇక మనకు సందేడ దొరుకుతుంది.. అందుకే వీళ్ల బంధానికి ఎలాగైన మంటపెట్టి మసిచేయాలని సంకల్పించుకున్నట్లుగా ఉందట.. ఈ కుట్రలో భాగంగా ఒక కల్పిత వార్తను తెరమీదికి తెచ్చింది.. అదెలా అంటారా.. తనకు అనుకూలమైన మీడియా ద్వారా.. ఇక ఆ మీడియా కధనాన్ని ఒక్కసారి గమనిస్తే..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత నెల 22, 23 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు.. ముఖ్యంగా పోలవరం నిధులు, రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన వాటి ప్రస్తావన మీద చర్చలు జరిపారట.. అయితే ఆ భేటీ అలా ముగిసిందో లేదో.. వెంటనే ఒక గాలి వార్త రయ్యిన దూసుకొచ్చింది.. అదేమంటే వైఎస్ జగన్ దూకుడు కొంత తగ్గించుకోవాలని, న్యాయవ్యవస్దను గౌరవించుకోవడం నేర్చుకోవాలని హెచ్చరించిన కేంద్రానికి సమాధానం చెప్పడానికే వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్ళి అమిత్‌ షా కు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నస్తున్నాడని ఆ మీడియా కధనం..

మరి ఈ విషయం మీకు ఎలా తెలిసింది అంటే విశ్వసనీయవర్గాల సమచారం.. అదీకూడా రహస్యంగా తెలిసింది అనే ఒక గాలి వార్త.. ఇలా పొద్దుబోక ఆ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారానికి జరుగుతున్న వాస్తవానికి ఎక్కడ కూడా పొంతన కుదరడం లేదు అన్న విషయాన్ని గమనిస్తున్న నెటిజన్లు ఈ ప్రచారానికి తెరతీసిన వారి మీద పంచ్‌లు వేస్తూ నవ్వుకుంటున్నారట..