Onion,Garlic: మొలకలు వచ్చిన వెల్లుల్లి,ఉల్లి తినవచ్చా,లేదా అని సందేహ పడుతున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే..!

Onion,Garlic:ప్రతి ఒక్కరి ఇంట్లో వంటల్లో కచ్చితంగా ఉపయోగించే రెండు పదార్థాలు వెల్లుల్లి, ఉల్లిపాయలు. ఈ రెండు లేకుండా ఏ వంట పూర్తి అవ్వదు. ఇవి వంట లోనే కాక చాలామంది పచ్చిగా కూడా తింటుంటారు. ఇవి రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలో విటమిన్ సి, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి6, మెగ్నీషియం, కాపర్ వంటివి అధిక మోతాదులో లభిస్తాయి. ఉల్లిపాయలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఫోలేట్ లభిస్తాయి.

సాధారణంగా ఏవైనా మొలకలు రావాలి అంటే వాటిని భూమి లో పాతిపెట్టాలి. కానీ వీటిని వంటింట్లో ఉంచిన సరే మొలకలు రావడం చూస్తుంటారు. ఉల్లి, వెల్లుల్లి ని భూమిలో పాతకపోయిన సరే ఇవి గాలిలో ఉన్న తేమ శాతాన్ని గ్రహించి మొలకెత్తుతాయి. ఈ ప్రక్రియ దాదాపుగా అందరి ఇళ్లల్లో జరిగేదే. అయితే చాలామంది మొలకల వరకు కట్ చేసి వీటిని వంటలలో ఉపయోగిస్తుంటారు. వీటిని అలా ఉపయోగించుకోవచ్చు లేదా అని చాలామందిలో కలిగే ఒక సందేహం. మొలకలు వచ్చిన ఉల్లి లేదా వెల్లుల్లిని ఉపయోగించడం మంచిదా కాదా అని ఒక లుక్ వేద్దాం.

ఇవి వాతావరణం లో ఉన్న తేమ వల్ల మొలకెత్తినా కూడా వీటిలో ఎటువంటి టాక్సిన్స్ విడుదల అవ్వవు. కేవలం ఇవి జిగటగా, కుల్లి పోయినట్టు అనిపిస్తాయి. సాధారణంగా మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి మొలకలను తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మొలకలలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అయితే వీటి మొలకలను డైరెక్టుగా తింటే అవి కొంచెం చేదుగా అనిపించవచ్చు. మొలకలు వచ్చిన ఉల్లి, వెల్లుల్లి లను వంటలలో వేసుకొని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయ వెల్లుల్లి మొలకలు రాకుండా ఉండాలంటే వాటిని బాగా గాలివీచే ప్రదేశంలో, పొడి వాతావరణంలో ఉంచాలి.