వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ కి గానీ, పార్టీకి గానీ, ఏడాది పాలనకు సంబంధించి గానీ ఎక్కడా ఎలాంటి విమర్శలు చేయలేదని నేడు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏడాది పాలనలో ఏ రోజు వ్యతిరేకంగా లేనని..తన దృష్టికొచ్చిన సమస్యలను సీఎంకు వివరించే ప్రయత్నం చేసినా కలిసే అవకాశం రాకపోవడంతో మీడియా ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసానన్నారు. నిజమే ఇలా సీఎంకి సమస్యలు వివరించుకోలేక అదే పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న మాట మాత్రం వాస్తవం.
సీఎంని కలవని బాధితులు రఘురాం ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారని ఇటీవలపై ప్రభుత్వంపై రేగిన అసమ్మతి సందర్భంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రండి..కలవడం..మాట్లాడండి అన్నట్లు జగన్ అన్నడం జరిగింది. ఇక వైకాపా అదిష్టానం నుంచి వచ్చిన షోకాజ్ నోటీస్ పై కూడా రఘురాం చాలా క్లియర్ గా మాట్లాడారు. రాష్ర్టంలో పార్టీకి సంబంధించిన కార్యదర్శి నుంచి రావాల్సిన నోటీస్ జాతీయ కార్యదర్శి నుంచి రావడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసారు. షోకాజ్ నోటీస్ కు సంబంధించి ప్రతీ అంశాన్ని రఘురాం పూస గుచ్చి మరీ వివరించారు. అయితే ఈ వివరణపై అదిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదు. నోటీస్ ఇచ్చిన విజయసాయి మాట్లాడలేదు.
ఆ విషయాలు పక్కనబెడితే రఘురాంని సీఎం ని కలవనీయకుండా అడ్డుపడే వ్యక్తి ఎవరంటే? రాజ్యసభ సభ్యుడు, ఎంపీ విజయసాయి అనే పేరు పొలిటికల్ కారిడార్ లో చర్చకొచ్చింది. రఘురాం విషయంలో తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్నది అతనేనని మాట్లాడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో విజయసాయి రెడ్డి వైఖరీని దగ్గరగా పరిశీలిస్తే అతని లో మార్పులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఆయన ట్విటర్ వంటి మధ్యమాల్లో కామెంట్లు సహా ప్రతీ విషయంలో జగన్ పేరు తీసుకొస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. చనిపోయేంత వరకూ జగన్ వెంటే ఉంటాను అని ఆయనే స్వయంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే జగన్ అతన్ని దూరం పెట్టకపోతే ఎందుకు వస్తుందని మరోసారి చర్చకొచ్చింది. పార్టీలో విజయసాయి ప్రాబల్యం తగ్గుతుందనే ఆయన ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్ సైతం వినిపిస్తోంది.