విజయ్ దేవరకొండ ప్లాప్ ల వెనుక ఆయన హస్తం ఉందా?

కెరియర్ మొదట్లో ‘నచ్చావులే’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి  సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు.

‘గీత గోవిందం’ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రాడ్’ ‘నోటా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు భారీగా నిరాశపరిచాయి. ఈ మధ్యే వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ విజయ్ కెరీర్లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ ఐపోతాడనుకున్న విజయ్ కి పెద్ద షాక్ తగిలింది.

తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.విజయ్ కథలు ఎంపిక విషయంలో పూర్తిగా తన తండ్రి వర్ధన్ పైనే ఆధారపడతారని సమాచారం.

ఈ వార్త పై విజయ్ దేవరకొండ తండ్రి వర్ధన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ విజయ్ కథల సెలక్షన్  విషయంలో నా హస్తం ఉందనీ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదు.కథల ఎంపిక విషయంలో విజయ్ జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన సినిమాల విషయంలో తన ప్రమేయం ఏమాత్రం ఉండదు అంటూ ఈ సందర్భంగా వర్ధన్ క్లారిటీ ఇచ్చారు.