ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజకీయం పార్టీ మధ్యన జరగడం లేదు. వైసీపీ, ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతుంది. ఒకరిపై ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాష్ట్ర ప్రజలకు ఒక త్రిల్లర్ ను చూస్తున్న ఫీల్ ను ఇస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్న చివరికి ముగిసి ఇప్పుడు మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పుడు మరో రూపంలో ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి యుద్ధం జరిగేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఈసీని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలు రద్దు కానున్నాయా!!
గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాల్లో అవకతవకలు జరిగాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బహిరంగంగానే తెలిపారు. అంటే ఆ ఎన్నికలకు సంబంధించి ఫ్రెష్ నోటిషికేషన్ మరోసారి విడుదల చేసే అవకాశముందని అర్థమవుతుంది. తాను ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపై ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన చెబుతున్నారు. దీంతో పాటు మార్చి 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. ఈలోపే మిగిలిన ఎన్నికలను కూడా పూర్తి చేసి వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.
వాళ్ళు కోర్ట్ కు వెళ్తారా!!
మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆల్రెడీ ఏకగ్రీవంగా ఎన్నిక అయిన వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశముందని భావించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారంటున్నారు. వైసీపీ కూడా తొలుత ఎన్నికలను వ్యతిరేకించినా న్యాయస్థానాల జోక్యంతో అన్ని ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది.