చట్టాలు పేదవాడికే. పాలకులకు చుట్టాలే అని మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు ఉ ల్లంఘిస్తే ఎవరినైనా క్వారంటైన్ లో వేసేయాల్సిందేనన్న కండీషన్ ఉంది. 14 రోజులు లేదా 28 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి పంపించాల్సిందే. అందులో ఎవరికి మినహాయింపు లేదని కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు కఠినంగానే చెప్పాయి. తాజాగా కేంద్ర మంత్రినే ఆ నిబంధనలకు తూట్లు పొడిచారు. పైగా తనని తాను సమర్ధించుకున్నారు కూడా. ఇంతకీ ఆ మంత్రివర్యలు ఎవరంటే?
కేంద్ర మంత్రి సదానంద గౌడ. సోమవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమనాంలో బెంగుళూరుకు చేరుకున్నారు. అక్కడి అధికారులు పరీక్షలు అనంతరం పంపిస్తామన్నారు. దీంతో మంత్రి గారు నేను ఫార్మాకింగ్ ని…వందల మందుల కంపెనీల అధిపతిని…కేంద్ర మంత్రిని నాకే కరోనా పరీక్షలా అని అంతెత్తున లేచిపడ్డారు. నాకు ఈ నిబంధలనలు వర్తించవు అని తప్పించుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజనులు విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రికి కరోనా రాదని చైనా డాక్టర్ చెప్పాడా? అమెరికా డాక్టర్ చెప్పడా? అంటూ విమర్శించారు. ఫార్మా కింగ్ లు అయినంత మాత్రానా మందులు..మాత్రలు జేబులో పెట్టుకుని తిరగరు. పైగా ఇది కరోనా మందు లేని జబ్బు అన్న సంగతి మంత్రిగారికి తెలియదా? అంటూ మండిపడ్డారు.
దీంతో మంత్రి లైన్ లోకి వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. మార్గదర్శకాలు అందరికీ ఒకటేనని, కానీ అత్యవసర బాధ్యతలు నిర్వర్తించే కొందరి కిమినహియింపు ఉంటుందని..అందులో తాను ఒకరని కప్పి పుచ్చే ప్రయత్నం చేసారు. ఇక ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ సమయంలో కారులో బయట తిరిగి బుక్కైన సంగతి తెలిసిందే. చివరికి హైకోర్టుతో అక్షింతలు వేయించుకుని…ప్రభుత్వాన్ని ఇరికించారు.