Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పదో ర్యాంకు పై స్పందించిన బాబు…. ట్వీట్ వైరల్!

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తన ఫ్యాబినేట్ లోని మంత్రులకు ర్యాంకులు విధించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా మంత్రుల పనితీరును బట్టి ర్యాంకులు విధించారు అయితే ఇందులో చంద్రబాబు నాయుడుకు ఆరో ర్యాంకు రాగా నారా లోకేష్ కు ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ కు పదవ ర్యాంక్ ఇవ్వడంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం ప్రజాసేవకే పరితపించే పవన్ కళ్యాణ్ కు ఇలా పదవ ర్యాంక్ ఇవ్వడం ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. లోకేష్ కంటే కూడా పవన్ పాలన అద్భుతంగా అందించలేకపోతున్నారా అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం గురించి స్పందిస్తూ చేస్తున్న పోస్ట్ వైరల్ అవుతుంది.

ప్రజలు 2024లో మాపై అపారమైన నమ్మకంతో మాకు 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ చేసిన విధ్వంశ పాలనను గాడిలోకి తీసుకురావాలి అంటే ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేస్తూ పని చేస్తేనే సాధ్యమవుతుంది అని తెలిపారు.

ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్టు చంద్రబాబునాయుడు తెలిపారు. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నమే ర్యాంకులు ఇవ్వడం అంటూ చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు.