Aaliya Bhatt: ఆర్ఆర్ఆర్ ప్రొమోషన్స్ కి ఆలియా రాదా! కారణం అదేనా?

Aaliya Bhatt : ఆర్ ఆర్ ఆర్ సినిమా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ లోను రిలీజ్ అవ్వబోతోంది. అంతే కాకుండా విదేశీ భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు.సంక్రాంతికే సినిమా విడుదల అవుతుందని అనుకున్నారు అందరు. చిత్ర యూనిట్ కూడా ప్రొమోషన్స్ బాగా చేసింది.30 కోట్లు ప్రొమోషన్స్ కోసం ఖర్చు పెట్టారని అప్పట్లో టాక్ వినిపించింది.

కరోనా ఎక్కువగా అవడంతో సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ప్రొమోషన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇక తాజాగా మరో విడుదల తేదిని ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. మార్చి 25 నా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో మళ్ళీ సినిమా ప్రొమోషన్స్ పై చిత్రా యూనిట్ దృష్టి పెట్టింది. అయితే ముందు లాగా కాకుండా చిన్నగా ప్లాన్ చేసారు నిర్మాత.

అయితే ఈసారి ప్రొమోషన్స్ కు ఆలియా భట్ దూరంగా ఉండనుంది. ఆలియా సినిమాలో రాంచరణ్ కు జోడిగా సీత పాత్రలో నటించింది. ఇక ఆలియా మిగతా సినిమాల షూటింగ్ ల కారణంగా ఈ ప్రొమోషన్స్ కి దూరంగా ఉందని చెప్తున్నారు. అయితే ఇది కుడా మంచిదే అని నిర్మాత భావిస్తునట్టు తెలుస్తోంది. గత రిలీజ్ టైములో అలియా ప్రమోషన్లకు 15 రోజులు కేటాయించింది. ఆ 15 రోజుల్లో అలియా ఖర్చు 3 కోట్లకుపైగానే అని అంటున్నారు. అలియా, తన స్టాఫ్‌కి ప్రత్యేక విమానాలు, హోటల్ రూమ్‌లు. వీటికి అక్షరాలా మూడు కోట్లు అయ్యాయట. ఈసారీ కూడా అంతే అవుతుంది. అందుకే అలియా ప్రమోషన్లలో ఉండడం వల్ల ఆర్‌.ఆర్‌.ఆర్‌కి ప్రత్యేకమైన గుర్తింపు, మైలేజీ ఏం ఉండదు.కాబట్టి.. అలియా లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాత తో పాటు చిత్ర యూనిట్ భావిస్తున్నారట. మరి ముంబై లోనైనా వస్తుందేమో చూడాలి.