ఏపీకి మహిళా సీఎం రాబోతోందా..? సంచలనంగా మారిన బీజేపీ నేతల వ్యాఖ్యలు

cm jagan mohan reddy n

 ఆంధ్రప్రదేశ్ లో మరి కొద్దీ రోజుల్లో అధికార మార్పిడి వుండబోతుందా..? అంతే అటు బీజేపీ వర్గాలు ఇటు టీడీపీ వర్గాలు మొదటి నుండి అవుననే చెపుతున్నాయి,. జగన్ సీఎం అయిన నాటి నుండి టీడీపీ అదే పాట పడుతుంది. తాజాగా వాళ్లతో బీజేపీ కూడా కలిసిపోయింది. కాషాయదళం నేత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

vishnu kumar raju

 రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని.. కానీ రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారి పోవచ్చన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని.. కానీ రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చన్నారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలన్నారు.

జగన్ సతీమణి భారతి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు. భారతి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విష్ణు కుమార్ రాజు ఉత్తర కొరియా నియంత అధ్యక్షుడు కిమ్‌తో జగన్‌ను పోల్చారు విష్ణుకుమార్ రాజు.

ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్‌కు ప్రజల కష్టాలు తెలియడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని.. అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.విష్ణకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే విష్ణు వర్ధన్ చెప్పినంత ఈజీగా ముఖ్యమంత్రి మార్పు వుంటుందా అనేది అనుమానమే..? ఎందుకంటే జగన్ పూర్తిగా మోడీకి మద్దతు తెలుపుతున్నాడు . ఉభయ సభల్లో ఆన్ కండీషనల్ గా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నాడు.

 అదే సమయంలో ఏపీ కోటాలో అంబానీ మిత్రుడికి రాజ్యసభ టిక్కెట్ కూడా ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు . రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేసిన వైసీపీ నేతలెవరూ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడింది చాలా తక్కువ. ఏ విధంగా చూసుకున్నా వైసీపీ తో బీజేపీ కి వచ్చిన ఇబ్బంది ఏమి కనిపించటం లేదు. కాబట్టి కొందరు బీజేపీ నేతలు కలలుకంటున్నట్లు ఏపీ లో ముఖ్యమంత్రి మార్పు అనేది ఇప్పట్లో జరిగే అవకాశమే లేదని చెప్పాలి