ఒకప్పుడు అంత రేటింగ్ వచ్చే జబర్దస్త్ ఇప్పుడు ఎంతకు పడిపోయిందో తెలుసా..?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో జబర్దస్త్ కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 9 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా జబర్దస్త్ నుండి ప్రముఖ కమెడియన్లతో పాటు జడ్జిలు కూడా వెళ్ళిపోయారు. దీంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. మునపటిలా కమెడియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు . జబర్దస్త్ నుండి ప్రముఖ కమెడియన్ ఆది వెళ్లిపోగా.. ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి సుడిగాలి సుదీర్ దూరమయ్యాడు.

ఈ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యి బయటకి వచ్చిన వారిలో సీనియర్ కమెడియన్ అప్పారావు కూడా ఒకరు. గత కొంతకాలంగా అప్పారావు జబర్దస్త్ షో కి దూరంగా ఉంటున్నాడు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల
లో పాల్గొన్న అప్పారావు తను జబర్దస్త్ కి దూరం కావటానికి గల కారణాల గురించి వివరించాడు. జబర్దస్త్ రేటింగ్స్ పెరగటానికి కారణమైన కమెడియన్స్ ని జబర్దస్త్ యాజమాన్యం వారు పట్టించుకోవటం లేదని అందువల్లే ఒక్కొక్కరిగా అందరూ జబర్దస్త్ కి దూరమవుతున్నారు అంటూ అప్పారావు వెల్లడించారు. కరోనా తగ్గిన తర్వాత జబర్దస్త్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్లి తనకు తిరిగి అవకాశాలు ఇవ్వమని కోరితే వారు నిర్లక్ష్యం వహించారని అప్పారావు వెల్లడించాడు.

అంతేకాకుండా జబర్దస్త్ నుండి తను వెళ్ళిపోతున్నాను అని చెప్పినా కూడా అక్కడ ఎవరూ పట్టించుకోలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు టాప్ రేటింగ్స్ తో నెంబర్ వన్ షో గా గుర్తింపు పొందిన ఈ జబర్దస్త్ రేటింగ్స్ ఇప్పుడు దారుణంగా గతంలో హైయెస్ట్ 18% రేటింగ్స్ అందుకున్న ఈ షో ఇప్పుడు ఆరు లేదా ఏడు రేటింగ్స్ తో నడుస్తోంది అంటూ అప్పారావు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఎంతో కాలం నుండి జబర్దస్త్ లో పని చేస్తున్న అప్పారావు కి జబర్దస్త్ యాజమాన్యం వారు ఒక స్కిట్ కి కేవలం రూ.20,000 మాత్రమే చెల్లి చేవారు. ఎక్కువ రెమ్యూనరేషన్ చమ్మక్ చంద్రకి ఇచ్చేవారని ఆయన చెప్పుకొచ్చాడు.