Radhe Shyam : “రాధే శ్యామ్” ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ సమాచారం మీకోసం!

Radhe Shyam : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ స్థాయి నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన హీరో ప్రభాస్. ఇప్పుడు తాను సినిమా చేస్తే అది పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. మరి ఇప్పుడు తాను నటించిన లేటెస్ట్ సినిమా అల్రెడీటీ రిలీజ్ కి రెడీగా ఉన్నది మాత్రం “రాధే శ్యామ్”. జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి అంతకంతకు ఆసక్తి రేపుతూ వెళుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈరోజు ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి చెయ్యని విధంగా మొట్టమొదటి నేషనల్ లెవెల్ ఈవెంట్ ని యూనిట్ ఈరోజు ప్లాన్ చేసారు. మరి అలాగే ఈరోజే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆసక్తికర సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. ఈ ట్రైలర్ మొత్తం కూడా “RRR” లానే మూడు నిమిషాలకి పైగానే ఉంటుందట.

అంతే కాకుండా ట్రైలర్ సగం అయ్యాక కనిపించే విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయట. అందులో గ్రాఫిక్స్ భారీ స్థాయి విజువల్స్ తో స్టన్నింగ్ గా అనిపిస్తాయట. మరి ఫాన్స్ చేతులు మీదుగా రిలీజ్ అయ్యే ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యూవీ మేకర్స్ నిర్మాణం అందించారు.