‘జాతిరత్నాలు’కు షాకిస్తామంటూ వస్తున్నారు

 

Interesting Fight Between Chavu Kaburu Challaga, Jathairatnalu

గత గురువారం విడుదలైన ‘జాతిరత్నాలు’ చిత్రం విజయవంతంగా కొనసాగుతోంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రధానంగా ఈ సినిమాను జనాలకు దగ్గర చేసింది ప్రమోషన్లే. ‘శ్రీకారం, గాలి సంపత్’ లాంటి సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా సక్సెస్ ముందు నిలవలేకపోయాయి. మొదటి వారంలో సినిమా 44 కోట్ల గ్రాస్, 27 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా నిర్మితమైంది 4 కోట్లతో. అమ్మింది 11 కోట్ల వరకు అమ్మారు. కానీ మొదటి వారంలోనే దానికి రెండింతల షేర్ ఖాతాలో వేసుకుంది.

గత వారం సినిమాలన్నీ తేలిపోగా ఈ వారం సినిమాలతోనే పోటీ ఉంది. వాటిలోనూ ‘చావు కబురు చల్లగా’తో మాత్రమే సినిమాకు పోటీ ఉంది. ఆ సినిమాను తట్టుకుంటే ఇంకొన్ని రోజులు ‘జాతిరత్నాలు’ హావాను చూపగలదు. మొదటి నుండి ఈ రెండు సినిమాల మధ్యనే పోటీ ఉంది. ఎందుకంటే ‘చావు కబురు చల్లగా’ వేడుకలో నిర్మాత బన్నీ వాస్ తమ సినిమా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు వేరే సినిమా బృందానికి. ఆ సినిమా మరేదో కాదని ‘జాతిరత్నాలు’ బృందమేనని టాక్. అందుకే ఈరోజు బాక్సాఫీస్ ఫైట్ రసవత్తరంగా సాగనుంది. మరి చూడాలి ‘చావు కబురు చల్లగా’ ‘జాతిరత్నాలు’ను ఏ స్థాయిలో ఎదుర్కొంటుందో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles