నిన్నటి నుండి సోషల్ మీడియాలో శర్వానంద్ చుట్టూ ఒక వివాదం నడుస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. అది కూడ నిర్మాతతో. నిజానికి ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీలో చాలా కామన్. కానీ శర్వానంద్ కాదు. తన సినిమాల వేడుకలు, విడుదలలు ఉంటే తప్ప బయట కనబడడు శర్వానంద్. తన పనేదో తాను చూసుకుని పోతుంటాడు. అందుకే ఆయన వివాదం అనేసరికి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వివరాల్లోకి వెళితే శర్వానంద్ చివరగా చేసిన చిత్రం ‘శ్రీకారం’.14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
ఈ సినిమాకి గాను శర్వాకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్లో అరకోటి వరకు బ్యాలెన్స్ పెట్టారట నిర్మాత. ఎన్నిసార్లు శర్వానంద్ కదిలించినా రెస్పాన్స్ లేదని దీంతో చేసేది లేక శర్వానంద్ నిర్మాతకు నోటీసులు పంపారని భోగట్టా. ఇక వీరిద్దరూ కలిసి చేసిన ‘శ్రీకారం’ మంచి సినిమా అనిపించుకుందే కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే నష్టాలే మిగిలాయి. అందుకే నిర్మాత బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇవ్వలేకపోయారని, అందుకే శర్వానంద్ లీగల్ చర్యలకు పూనుకున్నారని అంటున్నారు. ఇంకొదరైతే శర్వాకు రెమ్యునరేషన్ రావాల్సిన మాట నిజమే కానీ ఆయన లీగల్ ప్రొసీడింగ్స్ కోసం వెళ్ళలేదనేది ఇంకొందరి మాట. మరికొందరైతే వివాదాన్ని బయటకు తెలిసేలా చేయడం కోసం శర్వానంద్ కాంపౌండ్ నుండే ఈ లీకులు వచ్చాయని ఊహిస్తున్నారు.