జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి కోట్లు విలువైన బహుమతులు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు రెండు వందల కోట్ల మనీలాండరింగ్ కేసులో భాగంగా అరెస్ట్ అయినటువంటి సుకేష్ చంద్రశేఖర్‌తో ఈమెకు సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు భావించారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని వారు వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఈవెనింగ్ ముంబై ఎయిర్ పోర్టులో అధికారులు కూడా ఈమెను అడ్డుకున్న సంగతి తెలిసిందే.

సుకేష్ చంద్రశేఖర్‌ ఎంతో మందిని మోసం చేసి పెద్ద ఎత్తున డబ్బులు పోగు చేసినట్లు సమాచారం. సుమారు 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో భాగంగా అతనిని అరెస్టు చేయడంతో ఇతనితో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి సంబంధం ఉందని గతంలో వీరిద్దరూ కలిసి ఎంతో చనువుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఎయిర్పోర్టులో ఈమెను అడ్డగించడంతో ఈడీ అధికారులు ఈమెను విచారణకు ఆదేశించారు.

అలాగే బ్యూటీకి ఆ మోసగాడు 52 లక్షల విలువైన గుర్రాన్ని ఇచ్చాడని, అదేవిధంగా మరెన్నో విలువైన వస్తువులను బహుమతులు అందించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుకేష్ బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందికి పైగా మోసం చేశారని, అంతే కాకుండా ప్రముఖులు బంధువు అంటే పెద్దఎత్తున మోసం చేసి ముంబైకి వెళ్లారు. అక్కడ నకిలీ పథకాల ద్వారా 450 మందిని మోసం చేసిన 19.5 కోట్ల రూపాయల కాజేశారు. ఇలా ఎన్నో మోసాలు చేశారు.