తొమ్మిది ఫ్లాపులు ఇచ్చిన దర్శకునికి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీ అంటే?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా విజయాలను అందుకుంటున్న దర్శకులకు మాత్రమే అవకాశాలను ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అయినా ఒక్క సినిమా ఫ్లాపైతే ఆ దర్శకునికి ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు అస్సలు ఇష్టపడటం లేదు. వరుసగా రెండు మూడు ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ అయితే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే సీనియర్ ఎన్టీఆర్ పది ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి సక్సెస్ సాధించారు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం కావడం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన రామానాయుడు మొదట కొంతమంది వాటాదారులతో కలిసి అనురాగం అనే సినిమాను తెరకెక్కించగా ఈ సినిమాకు మంచి సినిమా అని పేరు వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేదు. రామానాయుడు తన వాటాగా 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగా ఆ మొత్తం కూడా తిరిగి రాలేదు.

ఆ తర్వాత రామానాయుడు ఎన్టీఆర్ ను కలిసి డేట్లు తీసుకున్నారు. తాపీ చాణక్య డైరెక్షన్ లో తెరకెక్కిన తొమ్మిది సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆయనపై ఉన్న నమ్మకం వల్ల రామానాయుడు ఛాన్స్ ఇచ్చారు. నరసరాజు గారు రాసిన ఒక కథను తాపీ చాణక్య తీసుకున్నారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమానే రాముడు భీముడు కావడం గమనార్హం. రొటీన్ కథే అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. తక్కువ కాల్షీట్స్ లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు డూప్ గా కైకాల సత్యనారాయణ నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 30 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.