జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనని రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి కాంబినేషన్ కలయిక వెనుక చిత్రవిచిత్రమైన కారణాలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఒక సినిమాను మించి మరొకటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 అనే సంగతి తెలిసిందే. స్టూడెంట్ నంబర్ 1 సినిమా వెనుక ఆసక్తికర కథ ఉంది.

మొదట జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనని రాజమౌళి కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ లుక్స్ నచ్చకపోవడం, తన మనసులోని ఊహలకు భిన్నంగా ఎన్టీఆర్ ఉండటంతో జక్కన్న ఈ తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్ నంబర్ వన్ సినిమా షూట్ మొదలైన తర్వాత కొన్నిరోజుల పాటు రాజమౌళి ముభావంగా ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే ఆ తర్వాత జక్కన్న తారక్ నటనను చూసి షాకయ్యారు.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్1 సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించడం రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు అనుగుణంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రూ.2 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా 12 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. చాలా రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద స్టూడెంట్ నంబర్ 1 సినిమా హవా కొనసాగింది. నిన్ను చూడాలని, స్టూడెంట్ నంబర్1, సుబ్బు ఒకే ఏడాది రిలీజ్ కాగా ఈ సినిమాలలో స్టూడెంట్ నంబర్ 1 మినహా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.