స్టార్ హీరోయిన్ సౌందర్యకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సౌందర్య నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. సౌందర్య 2004 సంవత్సరంలో విమాన ప్రమాదంలో మరణించారనే సంగతి తెలిసిందే. అయితే సౌందర్య జీవితంలో అభిమానులకు తెలియని ఎన్నో షాకింగ్ నిజాలు కూడా ఉన్నాయి.
సౌందర్య భగ్న ప్రేమకథ గురించి ఆమె అభిమానులలో చాలామందికి తెలియదు. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలలో నటించి సౌందర్య ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో సౌమ్య పేరును సౌందర్యగా మార్చుకున్న ఈ నటి సౌందర్యగానే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం గమనార్హం. తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుని ఈ నటి ఒక వెలుగు వెలిగారు.
సినిమా రంగంలో ఉన్న ఏ హీరోయిన్ గురించి అయినా సాధారణంగా ఎఫైర్స్ కు సంబంధించి వార్తలు వస్తుంటాయి. స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి కూడా ఈ తరహా వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. సౌందర్య వెంకటేష్ కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. వెంకటేష్ తో, జగపతిబాబుతో సౌందర్య ఎక్కువ సినిమాలు చేయగా వీళ్లిద్దరితో సౌందర్య ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే వైరల్ అయిన వార్తలు నిజమో కాదో మాత్రం అధికారికంగా క్లారిటీ రాలేదు. సౌందర్య చనిపోయిన సమయంలో జగపతిబాబు కంటతడి పెట్టారని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సౌందర్య జీవించి ఉంటే తెలుగులో ఆమె మరెన్నో సినిమాలలో నటించి విజయాలను ఖాతాలో వేసుకుని ఉండేవారని అభిమానులు భావిస్తున్నారు. సౌందర్య మరణించినా ఆమె సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారు.
