INSPIRING STORY: పాటల కోకిల పార్వతి… నవ్విన ఊరికే బస్సు తెప్పించిన ప్రతిభ

INSPIRING STORY: ప్రతిభ ఎవరి సొంత కాదు.. కేవలం డబ్బు, హోదా టాలెంట్ కు గీటురాయి కాదు. ప్రస్తుతం మనం చూస్తున్న సెలబ్రెటీలు జీరోస్థాయి నుంచి హీరోలుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. సరిగ్గా ప్రయత్నిస్తే చాలీ చాలని ఆర్థిక పరిస్థితులు కూడా లక్ష్యం ముందు తలవంచుతాయి. మనల్ని ఎగతాలి చేసి నోర్లే.. పొగుడుతూ ఉంటాయి. ఇవి మనం చాలా సందర్భాల్లో చూసినవే. తాజాగా సంగీత ప్రపంచంలోకి ఇలాగే ఓ యువకెరటం దూసువచ్చింది. రూపం కాకిలా.. గొంతు కోకిలలా ఉందంటూ.. చాలా మంది ఎగతాలి చేసినా.. ఏ ఒక్క క్షణం కూడా ఆమె తన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు.

ఇదంతా ఎవరికోసం చెబుతున్నానంటే.. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సెషన్ గా మారిని దాసరి పార్వతి గురించి. అసలెవరీ పార్వతి అంటే.. ‘ సరిగమప’ కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న యువతి. ఆమె పాటతో న్యాయ నిర్ణేతలు, టాప్‌ సింగర్స్, ప్రేక్షకులు అందరినీ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు పార్వతి అంటూ.. తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజెన్లు.

ఆమె నేపథ్యం కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంత కావడం విశేషం. ఆమెది కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామం. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతన్న కుటుంబం వాళ్లది. ఆమెకు ఇద్దరు అన్నలు ఉన్నారు. తను నిర్థేశించుకున్న లక్ష్యం వైపు సాగింది. ఆమె లక్ష్యాన్ని సాధించేందుకు చదువును కూడా పక్కన పెట్టింది. పల్లెటూరి అమ్మాయికి ఇవన్నీ అవసరమా అన్న నోర్లే.. ఇప్పుడు ఆమెను పొగడ్తలతో ముంచెతుతున్నారు. ఇంటర్‌ వరకు చదివి ఆ తర్వాత తన పూర్తి దృష్టి సంగీత సాధన మీదే పెట్టింది. ఆ ఊరికి బస్సు సౌకర్యం లేకపోయినా.. కిలో మీటర్లు నడిచి సంగీతం నేర్చుకుంది.

ఆమె పాటకు మంత్రముగ్దులైన జడ్జిలు ‘నీకు ఏం కావాలో కోరుకో’ అని అడగగానే.. ‘నాకు ఏం వద్దు సార్‌ మా ఊరికి బస్సు వస్తే చాలు’ అనేసింది. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె గ్రామానికి బస్సు వచ్చింది. ఎన్నాళ్ల నుంచో పార్వతి ఊరికి బస్ సౌకర్యం లేదు. తను సంగీతం నేర్చుకోవడానికి కూడా కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఒక సాధారణ యువతిగా ఊరి నుంచి వెళ్లిన పార్వతి. తన సొంతూరుకు బస్ రావడానికి కారణం అయింది. ఎంతో కాలం ఎదురుచూసిన బస్సు పార్వతి పాటతో వచ్చిందంటూ.. ఆ ఊరి వాళ్లకు వచ్చిందంటూ.. తెగ ఆనందపడిపోతున్నారు.