Venkatesh: వెంకటేష్ ఒక డమ్మీ పీస్… దారుణంగా అవమానించిన రైటర్… అసలు ఏం జరిగిందంటే?

Venkatesh: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు ఇటీవల ఈయన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లలో రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే అత్యంత భారీ హిట్ సినిమాగా నిలిచింది అని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా వెంకటేష్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హోదా అందుకున్న వెంకటేష్ గురించి ఓ రైటర్ మాట్లాడుతూ ఆయన ఒక డమ్మీ పీస్ అంటూ తనని అవమానించారని తెలుస్తుంది. మరి వెంకటేష్ ను ఇంత ఘోరంగా అవమానించిన రైటర్ ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు బెజవాడ ప్రసన్న కుమార్ అని తెలుస్తుంది.

ఈయన రచయితగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇలా మంచి రచయితగా పేరుపొందిన ప్రసన్నకుమార్ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని ఒక అద్భుతమైన కథతో ఆయన వద్దకు వెళ్లారట కథ మొత్తం మిన్న వెంకటేష్ సినిమా కథ చాలా బాగుందని అయితే ఒకసారి తన అన్నయ్య సురేష్ బాబుకు కూడా కథ చెప్పాలని సూచించారట.

ఇక సురేష్ బాబుకి కూడా ప్రసన్నకుమార్ కథను మొత్తం వివరించారు అయితే కథ విన్న తర్వాత సురేష్ బాబు ఈ సినిమా బాలేదంటూ మొహం మీద చెప్పేశారట. దీంతో ప్రసన్నకుమార్ చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశారు. అప్పటినుంచి వెంకటేష్ గారి కోసం ఒక కథ కూడా రాయలేదని తెలుస్తుంది అయితే ఎందుకు రాయలేదు అనే విషయం గురించి ఈయన ఇటీవల మాట్లాడుతూ.. వెంకటేష్ సినిమా చేయాలి అంటే ఆయన అన్నయ్య చెబితేనే చేస్తారు ఆయనకు సినిమా కథల ఎంపిక కూడా రాదని అతను ఒక డమ్మీ పీస్ అంటూ ప్రసన్నకుమార్ వెంకటేష్ అవమానించారంటూ ఈ వార్తలు సంచలనంగా మారాయి.