ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర వయసుతో సంబంధం లేకుండా సినిమాలు శరవేగంగా కంప్లీట్ చేస్తున్న స్టార్ హీరోలలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. “క్రాక్” హిట్ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలు ఒకేసారి రవితేజ ఒకే చేయడమే కాకుండా షూటింగ్ కూడా గ్యాప్ లేకుండా చేసేస్తూ వెళ్ళిపోతున్నాడు. అయితే రవితేజ కొత్త పాత అని లేకుండా టాలెంట్ ఉంటే ఆ దర్శకునికి పెద్దగా అనుభవం లేకపోయినా అవకాశం ఇస్తాడు.
ఇప్పుడు కూడా అలాగే ఎలాంటి ముందు అనుభవం లేకున్నా కొత్త దర్శకునిగా తన “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో శరత్ మందవ కి ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. మరి ఇపుడు ఉన్న లైనప్ తర్వాత మరో యంగ్ ఫిలిం మేకర్ కి కూడా అవకాశం ఇస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
వారు చెబుతున్న న్యూస్ ప్రకారం అయితే.. యాంకర్ ప్రదీప్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమా తీసి హిట్ ఇచ్చిన దర్శకుడు మున్నా తో రవితేజ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇందులో అయితే మరింత సరైన సమాచారం రావాల్సి ఉంది కానీ ప్రస్తుతం అయితే ఈ టాక్ వైరల్ గా మారింది.