గాసిప్స్ : రామ్ చరణ్ ఆ సినిమా ఆగిపోయింది నిజమేనట.!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ మార్కెట్ అందుకున్న హీరోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. అయితే రామ్ చరణ్ తన భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా సహా వరల్డ్ లెవెల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాక మరో పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో అయితే ఇంకో సినిమా చేస్తున్నాడు.

మరియు ఇది రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా చేస్తుండగా దీని పై కూడా అనేక అంచనాలు ఉన్నాయి. ఇక దీని తర్వాత కూడా రామ్ చరణ్ భారీ చిత్రాలు చేయనున్నాడు. మరి వాటిలో అయితే భారీ ఏక్షన్ సీక్వెన్స్ లతో ప్లాన్ చేసిన చిత్రం చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా ప్లాన్ చేశారు.

అయితే ఈ సినిమాని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రెడీ చెయ్యగా గత కొన్నాళ్ల కితం ఈ సినిమాపై కొన్ని గాసిప్స్ వచ్చాయి. అయితే ఈ గాసిప్స్ లో ఇప్పుడు ఆల్ మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం ఈ కాంబినేషన్ లో ఆగిపోయిందట.

మరి దీనికి గాను ఆ దర్శకుడు కొత్త హీరోని అయితే వెతుక్కుంటున్నాడని తెలుస్తుంది. పూర్తి స్క్రిప్ట్ తో రామ్ చరణ్ అంత హ్యాపీ గా ఫీల్ అవ్వలేదని అందుకే చరణ్ అయితే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వచ్చిన గాసిప్స్. మరి నెక్స్ట్ అయితే రామ్ చరణ్ ఎవరితో టేకప్ చేస్తాడో చూడాలి.