ఇన్సైడ్ టాక్ : ఎన్టీఆర్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా నిజమేనా?

ఇప్పుడు ఎందుకో గాని టాలీవుడ్ లో అయితే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు చేస్తున్నవి కాకుండా నెక్స్ట్ చేయాల్సి ఉన్న చిత్రాలుకి సంబంధించి అయితే పలు రూమర్స్ గట్టిగా స్టార్ట్ అయ్యాయి. మొదటగా RRR హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మీదనే ఇవి స్టార్ట్ కాగా ఎన్టీఆర్ కొరటాల శివే సినిమా అయితే ఆగిపోయిందని కొన్ని ఫేక్ రూమర్స్ వచ్చాయి.

కానీ అవి మాత్రం ఎక్కడా నిజం అని ప్రూవ్ కాలేదు కానీ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా అయితే గౌతమ్ తిన్ననూరితో ఆగిపోయింది అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ ఉందని పలు రూమర్స్ ఇప్పుడు కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ నుంచి వినిపిస్తున్నాయి. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు బుచ్చబాబు సానా అట. బుచ్చిబాబు ఉప్పెన తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనే ఎన్టీఆర్ నుంచి కూడా గోల్డెన్ ఛాన్స్ ని తాను అందుకున్నాడు. మరి పనిలో పనిగా బుచ్చిబాబు అయితే రామ్ చరణ్ కోసం కూడా ఓ అదిరిపోయే రియలిస్టిక్ కథని సిద్ధం చేసాడట. మరి కాంబోలో కూడా సినిమా పడేందుకు ఎక్కువ అవకాశాలే ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మాత్రం మరింత డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉన్నాయి.