ఇన్సైడ్ టాక్ : అఖిల్ “ఏజెంట్” రిలీజ్ టైం ని లాక్ చేస్తున్నారా?

టాలీవుడ్ నుంచి ఉన్న చిన్న హీరోస్ లో అఖిల్ అక్కినేని కూడా ఒకడు. అయితే అక్కినేని వారి కుటుంబం నుంచి తానే అందరికన్నా చివరి ఎంట్రీ ఇచ్చినప్పుడుకీ ఆశ్చర్యకరంగా అఖిల్ సినిమాల బిజినెస్ నే ఎక్కువ జరుగుతుంది. అలా తక్కువ హిట్స్ నే తాను అందుకున్నా ఇప్పుడు తాను చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “ఏజెంట్” పై అనేక అంచనాలు నెలకొనడం విశేషం.

అయితే అభిమానులు చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనే మాట మరింత సస్పెన్స్ గా మారింది. అయితే ఇప్పుడు ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ చిత్రం రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ వచ్చే ఏడాదికి లాక్ చెయ్యాలని చూస్తున్నారట.

బహుశా వచ్చే ఏడాది జనవరిలోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్లాన్ లో ఉన్నారట, అయితే ఇంకా ఈ రిలీజ్ కన్ఫర్మ్ చెయ్యలేదు కానీ ప్రెజెంట్ చిత్ర యూనిట్ లో ఈ డిస్కషన్ నడుస్తుంది అని తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే..