ఇన్సైడ్ టాక్ : ఎన్టీఆర్ ప్లాన్ చేసిన ఆ సినిమా ఆగిపోయిందా.?

యంగ్ టైగర్ కూడా ఓ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తర్వాత కొరటాల శివతో భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసాడు. అలాగే నెక్స్ట్ కూడా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తన కెరీర్ లో 31 వ సినిమాని ప్లాన్ చేసాడు. మరి ఈ రెండు సినిమాలు కూడా అధికారికంగా ఫిక్స్ కాగా..

నెక్స్ట్ అయితే ఈ చిత్రాలు తర్వాత ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తో ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమాని అయితే ఎన్టీఆర్ ఓకే చేసాడు. మరి ఈ మూడు కొత్త ప్రాజెక్ట్ లలో ఒకానొక సమయంలో అయితే మొదట బుచ్చిబాబు తో సినిమానే చేసే పరిస్థితి కూడా వచ్చింది.

కానీ ఫైనల్ గా కొరటాల శివ సినిమా స్పేస్ ఆక్యుపై చేయగా మరి నెక్స్ట్ అయితే వీటిలో ఓ సినిమా తాత్కాలికంగా ఆగిపోయినట్టు తెలుస్తుంది. మరి ఆ సినిమా అయితే దర్శకుడు బుచ్చిబాబు తో ప్లాన్ చేసిన సినిమా అట.

ఇప్పట్లో అయితే అసలు ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో జోక్యం కూడా చేసుకునే పరిస్థితి లేనట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ సినిమా అందాకా జరిగే ఛాన్స్ లేనట్టు తెలుస్తుంది. మరి ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేక బుచ్చిబాబు మరో సినిమా వేరే హీరోతో చేస్తాడో అనేది చూడాలి.