ఇండస్ట్రీ టాక్ : ఆ సినిమా ఒప్పుకొని విజయ్ దేవరకొండ తప్పు చేస్తున్నాడా?

తెలుగు సినిమా దగ్గర పరిచయం అయ్యి అనతి కాలం లోనే భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరోస్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. అయితే విజ్జాయ దేవరకొండ అయితే తన కెరీర్ పాన్ ఇండియా అపీల్ ని చాలా త్వరగానే తెచ్చుకున్నాడు కానీ షాకింగ్ గా ఆ సినిమాతోనే భారీ డిజాస్టర్ ని తాను మూటగట్టుకోవాల్సి వచ్చింది.

దీనితో వెంటనే దర్శకుడు పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా జనగణమన నుంచి బయటకి వచ్చేసాడని కూడా రూమర్స్ ఉన్నాయి. మరి ఈ చిత్రం తర్వాత ఖుషి సినిమాలో బిజీగా ఉన్నాడు. కానీ ఈ సినిమాలు కాకుండా మరో సినిమా ఓకే చేసినట్టు సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ స్టార్ట్ కాగా విజయ్ అయితే తప్పుడు చేస్తున్నట్టు అంటున్నారు.

రామ్ చరణ్ తో జెర్సీ దర్శకుడు ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ దానిని స్క్రిప్ట్ నచ్చక చరణ్ రిజెక్ట్ చేసాడు కానీ విజయ్ మాత్రం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనితో చరణ్ లాంటి హీరో చెయ్యని సినిమా విజయ్ ఓకే చెయ్యడంతో అభిమానుల్లో సహా సినీ వర్గాల్లో ఇది టాపిక్ గా మారింది. మళ్ళీ విజయ్ రాంగ్ స్టెప్ వేస్తున్నట్టుగా అంటున్నారు. మరి విజయ్ అయితే ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తాడో లేదో చూడాలి.