Puri Jagannath : ఇన్సైడ్ టాక్ : హాలీవుడ్ లోకి వెళ్లిపోతున్న పూరి జగన్నాథ్?? ఎప్పుడు ఎలా అంటే.!

Puri Jagannath : ఇప్పుడు మన తెలుగు సినిమాల ఖ్యాతి కానీ అలాగే తెలుగు హీరోల క్రేజ్ గాని దేశంలో ఎల్లలు దాటేసింది. అలాగే ఈ హీరోలను ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేసే కొందరు దర్శకులు కూడా ఉన్నారు. అయితే అలాంటి దర్శకుల్లో లేటెస్ట్ గా చేరిన పేరు పూరి జగన్నాథ్.. అయితే లేటెస్ట్ అనే కాకుండా పూరీ జగన్నాథ్ ఇది వరకే పాన్ ఇండియా సినిమాని కెలికి వదిలేసిన వాడే..

మళ్లీ ఇప్పుడు రౌడి హీరో విజయ్ దేవరకొండ తో “లైగర్” అనే ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ డాషింగ్ అండ్ డైనమిక్ దర్శకుడు ఏకంగా హాలీవుడ్ లోకి ఎంటర్ కాబోతున్నట్టు గా ఇండస్ట్రీ వర్గాలలో లేటెస్ట్ గా వినిపిస్తున్న కొత్త టాక్. తాను ఛార్మి బ్యానర్ లు కలిసి ఒక అంతర్జాతీయ భారీ సినిమాని చెయ్యడానికి సిద్ధం అవుతున్నారట.

అలాగే ఈ సినిమాని పూరినే దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో కూడా తెలుస్తోంది. ఈ భారీ సినిమాని పూరీ ఇప్పుడు చేస్తున్న లైగర్ అలాగే ఆ తర్వాత తాను చేయనున్న తన కలల చిత్రం “జనగణమన” ల తర్వాత స్టార్ట్ చెయ్యనున్నాడట.

అలాగే ముందు రోజుల్లో ఈ బిగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు బయటకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆల్రెడీ తన లైగర్ లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని పెట్టి ఆల్రెడీ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ గానే సిద్ధం చేస్తున్నాడు. మరి చూడాలి ఆ సిసలైన ఇంటర్నేషనల్ సినిమా ఎలా ఉంటుందో అనేది.