RRR : ఇండస్ట్రీ బజ్ : “RRR” రిలీజ్ కి డేట్ ఫైనల్ అయ్యిందట.!

RRR : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సహా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సాలీడ్ మాస్ హీరోలతో అంతే మాస్ సినిమాలు చేయగలిగే ఇండియాస్ నెంబర్ 1 దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే.

ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు రిలీజ్ అయ్యినా కూడా నాన్ ట్రిపుల్ ఆర్ అనే రికార్డులు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. దీనితో చాలా ఆసక్తిగా మారిన ఈ సినిమా రిలీజ్ కి కొన్ని డేట్స్ ని కూడ చిత్ర బృందం రివీల్ చేశారు.

మరి ఇప్పుడు ఈ డేట్స్ లో దేనికి ఈ సినిమా ఫైనల్ అయ్యింది అనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. మొదటగా అనుకున్న మార్చ్ 18కి గాను ఎలాంటి అవకాశం లేనందున ఈ సినిమా విడుదల ఈ డేట్ కి మళ్ళీ వాయిదా వేసారట.

దీనితో ఇక రెండోది గా అనుకున్న డేట్ కే ఈ చిత్రాన్ని అంటే ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు చెబుతున్నాయి. ఇక ఈ మహా సినిమాకి కీరవాణి సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.