రోజా గారికి కోసం జబర్ధస్త్ వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డ ఇంద్రజ..!

ప్రముఖ నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించిన ఇంద్రజ కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంది. మరీ ఇప్పుడు టీవీ షోల ద్వార ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమౌతున్న పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యింది. జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా మంత్రి పదవి తగ్గటంతో జబర్దస్త్ కు స్వస్తి చెప్పిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం రోజా స్థానంలో ఇంద్రజ జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరిస్తు రోజా లేని లోటు తీరుతున్నారు.

కొంత కాలం శ్రీదేవీ డ్రామా కంపెనీ షో కి జడ్జ్ గా వ్యవహరించిన ఇంద్రజ ప్రస్తుతం జబర్ధస్త్ షో లో కూడా సందడి చేస్తున్నారు. ఇటీవల ఎక్స్ ట్రా జబర్ధస్త్ షో లో ఇంద్రజ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇటీవల జరిగిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో ఇంద్రజ టీమ్ లీడర్స్ ని తన ప్రశ్నలతో టెన్షన్ పెట్టింది. ఈ క్రమంలో రాంప్రసాద్ కూడా ఇంద్రజ గారిని ఒక ప్రశ్న వేశాడు. రోజా గారికి మంత్రి పదవి రాకూడదని మీరు దేవుడికి మొక్కుకున్నారంట కదా .. ఎందుకు మేడం ? అని అడిగాడు. దీని గురించి స్పందించిన ఇంద్రజ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

ఈ క్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ..రోజాకు మంత్రిగా అవకాశం రాకూడదని భగవంతుడిని కోరుకున్నాను అంటూ స్వయంగా చెప్పారు. అయితే ఇంద్రజ ఇలా కోరుకోవటం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. వీరి మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవు. రోజా గారి మీద ఉన్న గౌరవం వల్లే ఇంద్రజ ఇలా కోరుకుంది. 9 సంవత్సరాలుగా రోజా జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరించింది. దీంతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. రోజా గారి లేని లోటు ప్రేక్షకులలో స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్లే ఆమెకి మంత్రి పదవి దక్క కుండా జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.