దేశీయ స్టాక్ మార్కెట్లు గురవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 248 పాయింట్లు పెరిగి 55717 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 16679.40 వద్ద ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల ట్రెడ్ అవుతుండడం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనర్జీ స్టాక్‌ల లాభాల కారణంగా మార్కెట్‌లు కాస్త పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఐఒసి, యుపిఎల్, టాటా స్టీల్,కోల్ ఇండియా, ఒఎన్‌జిసి ప్రధాన లాభాల్లో ఉండగా.. అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, సిప్లా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నష్టపోయాయి. మరోవైపు బ్రెంట్ బ్యారెల్‌కు $116 డాలర్లకు చేరింది.