Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎన్ఎస్ఈలో బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా చరిత్ర సృష్టించారు

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. దేశంలోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ (NSE)లో బెల్ మోగించిన తొలి దక్షిణ భారత నటుడిగా గౌరవం దక్కించుకున్నారు.

ఈ చారిత్రాత్మక ఘట్టం బాలకృష్ణ ఎన్‌ఎస్‌ఈ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు హాజరయ్యారు. తన తల్లి స్మారకార్థంగా స్థాపించబడిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు బాలకృష్ణ ఎన్నేళ్లుగా అండగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా వేలాది మంది ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం అందేలా కృషి చేస్తున్నారు.

ఎన్ఎస్ఈలో బెల్ మోగించే గౌరవం పారిశ్రామిక దిగ్గజాలు, సంస్కరణకారులు, జాతీయ ప్రాధాన్యత కలిగిన వ్యక్తులకే లభిస్తుంది. ఆ జాబితాలో బాలకృష్ణ చేరడం ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు సామాజిక సేవ, వైద్యరంగంపై చూపుతున్న ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.

ఇటీవలే బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆయన నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2 విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ చారిత్రాత్మక ఘట్టం ఆయన కెరీర్‌లో మరో విశిష్ట మైలురాయిగా నిలిచిపోయింది. సినీ, రాజకీయాలకు మించి బాలకృష్ణ మానవతా విలువలు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినట్టు ఈ ఘట్టం మరోసారి రుజువు చేసింది.

Public Shocking Reaction On Bigg Boss 9 Telugu | Bigg Boss Public Talk | Srija Dammu | Telugu Rajyam