Pushpa Review By Cricketer :వైరల్ : “పుష్ప” చూసాక ఇండియన్ క్రికెటర్ నుంచి ఊహించని రివ్యూ.!

Pushpa Review By Cricketer : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి తెలుగులో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో హిందీ ఆడియెన్స్ లో కూడా అంతే స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

పైగా ఇండియన్ క్రికెటర్ జడేజా కూడా ఈ సినిమా డైలాగ్ పేల్చడం ఆసక్తిగా మారింది, అలాగే పొలిటికల్ పార్టీలు కూడా పుష్ప డైలాగ్స్ చెప్పడంతో పుష్ప క్రేజ్ ఏ రేంజ్ లో వెళ్లిందో కూడా అందరికీ అర్ధం అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా చూసిన ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అందులోని తెలుగు వాడు అయ్యిన హనుమా విహారి పుష్ప హిందీ వెర్షన్ స్పెషల్ షో చూసి తన రివ్యూ చెప్పకుండా ఉండలేకపోయాడు.

తాను ఇంకా పుష్ప ట్రాన్స్ లోనే ఉన్నానని వెర్సిటైల్ నటుడు అల్లు అర్జున్ నటన అమోఘం టోటల్ అంతా కూడా సూపర్ గా ఉందని కొనియాడాడు అంతే కాకుండా పార్ట్ 2 కోసం అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు.

దీనితో ఐకాన్ స్టార్ రిప్లై ఇస్తూ నా నటన మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని మా పుష్ప ప్రపంచాన్ని ఇష్టపడినందుకు చాలా ఆనందంగా ఉందని ధన్యవాదాలు తెలిపాడు. దీనితో ఈ ట్వీట్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.