మాజీ క్రికెటర్‌ గైక్వాడ్‌ కన్నుమూత… బీసీసీఐకి రూ.కోటి మిగిలింది!?

టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, బీసీసీఐ తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు, వర్థమాన క్రికెటర్లు అయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ సమయంలో బీసీసీఐపై పలు విమర్శలు వస్తున్నాయి! అన్షుమాన్ గైక్వాడ్ 1974 – 87 మధ్య భారత జట్టు తరుపున 40 టెస్టులు, 15 వన్ డేలు ఆడారు. ఇంటర్నేషనల్ కెరీర్ లో మొత్తం 2,254 పరుగులు చేశారు. వాటిలో రెండు శతకాలు ఉండగా.. 1983లో జలంధర్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఆయన చేసిన 201 పరుగులు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రత్యేకమే.

అనంతరం టీమిండియాకు హెడ్ కోచ్ గా రెండు సార్లు పనిచేశారు అన్షుమాన్ గైక్వాడ్. 1990ల్లో నేషనల్ టీం సెలక్టర్ గా, ఇండియన్ క్రికెటర్స్ అసోషియేషన్ కి అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఇదే సమయంలో… 1997 – 99 మధ్య కాలంలో ఓసారి కోచ్ గా వ్యవహరించాడు. ఆయన కోచ్ గా ఉన్న సమయంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000లో భారత్ రన్నరప్ గా నిలిచింది.

ఇక గైక్వాడ్ మరణం పట్ల స్పందించిన మోడీ సంతాపం తెలిపారు. ఇందులో భాగంగా… “క్రికెట్ కు గిక్వాడ్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా… ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని సానుభూతి వక్తం చేశారు.

అన్షుమన్‌ గైక్వాడ్‌ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు గైక్వాడ్‌ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రధాని సానూభూతి వ్యక్తం చేశారు. అయితే గైక్వాడ్ మృతి విషయంలో బీసీసీఐ వ్యవహార శైలిని పలువురు తప్పుపడుతున్నారు.

వాస్తవానికి గైక్వాడ్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఆయన దేశం కోసం ఎంతో చేశారని.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చారని.. ఇప్పటిలా అప్పుడు క్రికెటర్లకు భారీ సంపాదన ఉండేది కాదని చెబుతు.. ఈ విషయంలో బీసీసీఐ తక్షణం స్పందించి ఆదుకోవాలని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ విన్నవించారు.

ఇదే సమయంలో కపిల్ దేవ్ తో పాటు పలువురు క్రికెటర్లు సైతం బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. అయితే… ఈ విషయంలో ఇటీవల స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్స కోసం కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇంతలోనే గైక్వాడ్ కన్నుమూశారు. దీంతో… బీసీసీఐ వ్యవహారశైలిపై నెటిజన్లు, అభిమానులు ఫైరవుతున్నారు.

కపిల్ దేవ్ విన్నవించిన వెంటనే బీసీసీఐ హుటాహుటిన స్పందించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారని అంటున్నారు. ఇలాంటి విషయాల్లో, ఇలాంటివారి విషయాల్లో అయినా యుద్ధప్రాతిపదికన స్పందించి ఉంటే… ఇలాంటి దారుణాలు వెలుగులోకి రావని చెబుతున్నారు!